CA ఎగ్జామ్స్ వాయిదా

న్యూఢిల్లీ (CLiC2NEWS): క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డికోసం ప‌లురాష్ట్రాల్లో క‌ఠిన ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేప‌త్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మే 21 నుంచి జ‌ర‌గాల్సిన ఛార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అలాగే 22 నుంచి జ‌ర‌గాల్సిన ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌ను కూడా వాయ‌దా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. క‌రోనా విజృంభ‌ణ దృష్ట్యా ఈ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప‌రీక్ష‌లు మ‌ళ్లీ ఎప్పుడు జ‌రిపేది విద్యార్తుల‌కు క‌నీసం 25 రోజుల ముందుగానే స‌మాచారం ఇస్తామ‌ని తెలిపింది. అలాగే పూర్తి వివ‌రాల‌కు.. అప్‌డేట్స్ కోసం www.lcal.org వెబ్‌సైట్ ను సంద‌ర్శించ‌వ‌చ్చ‌ని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.