Tirupati: 9వ రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీకి 78,799 ఓట్ల భారీ ఆధిక్యం

తిరుపతి(CLiC2NEWS): తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు ఇవాళ (ఆదివారం) వెలువడనున్నాయి. ప్రతీ రౌండ్ లోనూ అధికార వైసీపీ జోరు కొనసాగిస్తోంది. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు. తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీకి 78,799 ఓట్ల భారీ ఆధిక్యం సాధించింది. పటిష్ట భద్రత, కరోనా నిబంధనల మధ్య ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.