Nagarjuna Sagar: సాగర్ లో టీఆర్ఎస్ విజయం

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక | ||
---|---|---|
Party | Won | |
టీఆర్‌ఎస్ | 18449 | |
కాంగ్రెస్ | 0 | |
బీజేపీ | 0 |
నల్లగొండ (CLiC2NEWS): నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించారు. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జానారెడ్డి నుంచి గట్టిపోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ, ఎక్కడా అలాంటి పోటీ కనిపించలేదు. టిఆర్ఎస్ పార్టీ మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆదిక్యన్ని కనబరిచింది. టిఆర్ఎస్ పార్టీ నేత నోముల భగత్ 18వేలకు పైగా మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానా రెడ్డి విజయంపై నమ్మకం పెట్టుకున్నప్పటికీ ఓటర్లు మాత్రం కారువైపు మొగ్గుచూపారు. ఇక దుబ్బాక,హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ సాగర్ ఉపఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే.
నోముల భగత్ ప్రతి రౌండ్‌లోనూ మంచి ఆధిక్యం కనబరిచారు. వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించగా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మళ్లీ మిగతా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శించింది.
ఈ ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానానికి పరిమితం కాగా, బీజేపీ అభ్యర్థి రవి నాయక్ డిపాజిట్ గల్లంతు అయింది.
పోస్టల్ బ్యాలెట్స్‌లో టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్స్‌లోనూ టీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం 1384 పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌కు 822 ఓట్లు, కాంగ్రెస్‌కు 428 ఓట్లు, బీజేపీకి 30 ఓట్లు, టీడీపీకి 6 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్ లీడ్ 394 ఓట్లు.
టీఆర్‌ఎస్‌కు 18,449 ఓట్ల ఆధిక్యం
రౌండ్ల వారీగా వివరాలు
- 25వ రౌండ్ లో
25వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 2443
కాంగ్రెస్‌కు 2408 ఓట్లు వచ్చాయి. - 25వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ లీడ్ 35 ఓట్లు
- 24వ రౌండ్ లో
టీఆర్ఎస్ కు 3312 ఓట్లు.
కాంగ్రెస్ కు 2512 ఓట్లు వచ్చాయి.
24 వ రౌండ్ లో టీఆర్‌ఎస్ లీడ్ 800 ఓట్లు. - 23వ రౌండ్‌లో
టీఆర్‌ఎస్ 17,614 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కంటే 849 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. - 22వ రౌండ్‌లో లో
టీఆర్ఎస్ కు 3783 ఓట్లు.
కాంగ్రెస్ కు 2540 ఓట్లు వచ్చాయి.
22వ రౌండ్ లో టీఆర్‌ఎస్ లీడ్ 1243. - 21 వ రౌండ్ లో
టీఆర్ఎస్ కు 3463 ఓట్లు.
కాంగ్రెస్ కు 3011 ఓట్లు వచ్చాయి.
21 వ రౌండ్ లో టీఆర్‌ఎస్ లీడ్ 452 ఓట్లు. - 20వ రౌండ్‌లో
టీఆర్ఎస్ కు 15,556 ఓట్ల ఆధిక్యం - 19వ రౌండ్ లో
టీఆర్‌ఎస్‌కు 3732.
కాంగ్రెస్ కు 2652 ఓట్లు - 18వ రౌండ్ లో
టీఆర్‌ఎస్‌కు 4074..
కాంగ్రెస్ కు 2259 ఓట్లు - 17వ రౌండ్‌లో
టీఆర్ఎస్ పార్టీకి 3772 ఓట్లు
కాంగ్రెస్ కు 2349 ఓట్లు - 16వ రౌండ్‌లో
టీఆర్ఎస్ పార్టీకి 3475 ఓట్లు
కాంగ్రెస్ కు 3231 ఓట్లు - 15వ రౌండ్‌లో
టీఆర్ఎస్‌కు 3203
కాంగ్రెస్ కు 2787 ఓట్లు - 14వ రౌండ్‌లో
టీఆర్ఎస్ పార్టీకి 2,734 ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి 3,817 ఓట్లు రాగా - పదమూడో రౌండ్‌లో
టీఆర్ఎస్ పార్టీకి 3,766 ఓట్లు
కాంగ్రెస్ కు 3546 ఓట్లు - పన్నెండో రౌండ్‌లో
టీఆర్ఎస్ కు 3833
కాంగ్రెస్ కు 2578 ఓట్లు - పదకొండో రౌండ్‌లో
టీఆర్ఎస్ కు 3,395 ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి 2,225 ఓట్లు - పదో రౌండ్‌లో
టీఆర్ఎస్‌కు 2,991 ఓట్లు
కాంగ్రెస్‌కు 3,166 ఓట్లు - తొమ్మిదో రౌండ్‌లో
టీఆర్ఎస్‌కు 2,205 ఓట్లు
కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు - ఎనిమిది రౌండ్లో
టీఆర్ఎస్‌కు 3, 249 ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు - ఏడో రౌండ్లో
టీఆర్ఎస్ పార్టీకి 4,022 ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు - ఆరో రౌండ్‌లో
టీఆర్ఎస్ పార్టీకి 3,989 ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు - ఐదో రౌండ్‌టో
టీఆర్ఎస్‌కు 3,442 ఓట్లు
కాంగ్రెస్ కు 2676 ఓట్లు
బీజేపీకి 74 ఓట్లు - నాలుగో రౌండ్‌లో
టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు
కాంగ్రెస్ కు 3,202 ఓట్లు - మూడో రౌండ్‌లో
టీఆర్ఎస్ పార్టీకి 3421 ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు - రెండో రౌండ్‌లో
టీఆర్ఎస్‌కు 3,854 ఓట్లు
కాంగ్రెస్‌కు 3113 ఓట్లు - తొలి రౌండ్‌లో..
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,228 ఓట్లు
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు