Corona: మూడోసారి 4 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. రోజూ 4 ల‌క్ష‌ల‌కు పైగా రోజువారీ కేసులు, 4 వ‌లేకు చేరువ‌గా మ‌ర‌ణాలు న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వ‌డం దేశంలో ఇది మూడోసారి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ శుక్ర‌వారం ఉద‌యం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,14,91,598కు చేరాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో క‌రోనా బారి నుండి 3,31,507 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 1,76,12,351 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 36,45,164 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గురువారం ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 3915 మంది మ‌ర‌ణించ‌డంతో మొత్తం మ‌ర‌ణాలు 2,34,083కి పెరిగాయి.

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 62,194 కేసులు ఉండ‌గా, క‌ర్ణాట‌క‌లో 49,058, కేర‌ళ‌లో 42,464 చొప్పున ఉన్నాయి. ఇక నిన్న మ‌హారాష్ట్ర‌లో 853 మంది మృతిచెంద‌గా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 350, ఢిల్లీలో 335 మంది బాధితులు చ‌నిపోయారు.

Leave A Reply

Your email address will not be published.