AP CoronaVaccine: గుంటూరులో గందరగోళం

గుంటూరు (CLiC2NEWS): ఎపిలోని గుంటూరు మల్లికార్జునపేట కొవిడ్ టీకా పంపిణీ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం శుక్రవారం ఉదయం నుండి టీకా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నా టోకెన్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదంటూ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. గందరగోళం నెలకొనడంతో టోకెన్ల పంపిణీని అధికారులు నిలిపేశారు. అధికార యంత్రాంగం తీరుపై ప్రజలు ఆందోళనకు దిగారు. టీకా కేంద్రం వ‌ద్ద‌కు పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Leave A Reply

Your email address will not be published.