పోలీసుల అదుపులో పుట్ట మధు?

హైద‌రాబాద్‌: పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్ట్ అయ్యారు. జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధును భీమవరంలో అరెస్ట్ చేశారు పోలీసులు. ప్ర‌స్తుతం ఆయ‌న రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే పుట్టమధును ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు మాత్రం చెప్పలేదు. ఏ కేసులో పుట్ట మధును అరెస్ట్ చేశారో చెప్పడానికి పోలీసులు నిరకరించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

పుట్ట‌మ‌దు వారం రోజులుగా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న అదృశ్యానికి సంబంధించి కార‌ణాల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలుస్తోంది. వామ‌న్‌రావు హ‌త్య కేసులో మ‌ధును పోలీసులు ఇప్ప‌టికే విచారించారు. వామ‌న్‌రావు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు మ‌రోసారి ఆయ‌న్ను ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.