టి. వేదాంత సూరి: ఆరు పదుల కష్టానికి గుర్తింపు..
అవును ఇప్పుడు గంగవ్వ పేరు అందరి నోటా వినిపిస్తుంది.. ఆరు పదుల వయసు దాటాకా ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది.. ఆరు పదుల వయసు దాకా ఆమె పాడనీ కష్టం లేదు.. భర్త తాగుబోతు.. కొన్నాళ్ళు ఇల్లు ముంగిలి విడిచి ఎక్కడికో వెళ్ళాడు. వచ్చాక ఇంటిని ఇల్లాలిని పిల్లలను పట్టించుకోలేదు. అయినా ధైర్యంతో అడుగులు ముందుకు వేసింది. తనకు ఇది కావాలని, అది కావాలని ఎప్పుడూ కలలు కనలేదు. ఒక సుముహూర్తాన తానూ వున్నా ఊరికే శ్రీకాంత్ వచ్చాడు.. మై విల్లెజి షో వీడియో షోలు ప్రారంభించాడు.. ఆయన కంట గంగవ్వ పడింది. విపరీతమైన జ్ఞాపక శక్తి. చదువు రాదు. కానీ చెప్పింది గుర్తుంచుకుని .. దానికి తెలంగాణ సొబగులు అద్ది. చెప్పగలదు .. అందుకే ఆమె ప్రపంచ వీడియో ప్రేక్షకులకు ఆరాధ్య దైవంగా మారింది.. అందరికి బామ్మ గా మారింది.. ఆమె ఎవరిని తిట్టినా అదే దీవనగా భావించడం అలవాటైంది .. హైదరాబాద్ లో పెద్ద సినిమా కార్యక్రమాలకు హాజరై వేదికలెక్కింది.. రవీంద్ర భారతిలో అవార్డులు అందుకుంది. సమంత, విజయ దేవరకొండ వంటి వారిని ఇంటర్వ్యూ చేసింది. టి. వి. లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది.. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ – 4 ఇంటిలోకి అడుగు పెట్టింది. ఎన్నెన్నో అనుకోని విజయాలు అక్కున చేర్చుకుంది. ఎక్కడి జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామం, చదువు లేదు, వ్యవసాయం చేసుకుంటుంది. కానీ ప్రతిభ వుంది.. ఫలితంగా అనుకోని విజయాలు చవి చూసే అవకాశం వచ్చింది.. ఇది ఎందరికో స్ఫూర్తి గా మారింది..ఏదీ ఆశించకుండా. కష్టపడుతూ తమ పని తాము చూసుకుంటూ పొతే తప్పకుండ ఏదో ఒక రోజు మంచి ఫలితం లభిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. .. ఆరు దశాబ్దాల పాటు అపహాస్యానికి గురైన తెలంగాణ యాసకు ఇది పట్టాభిషేకం. ఈ సందర్బంగా అందరం గంగవ్వను అభినందిద్దాం ..