Corona: యుపి మంత్రి మృతి

గురుగ్రామ్‌ (CLiC2NEWS):  దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క త‌దిత‌ర రాష్ట్రాల్లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యుపిలో కూడా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. ఈ మ‌హ‌మ్మారి సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు కరోనా సోకుతున్నది. తాజాగా కరోనాతో యుపి మంత్రి విజయ్ కశ్యప్ కన్నుమూశారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయనకు కరోనా సోక‌డంతో గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ముజఫర్ జిల్లాలోని చార్తవాల్ నియోజక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది యోగి కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా ఇప్పటికే యుపిలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.