TSPSC: చైర్మన్‌, సభ్యుల నియామకం

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌(టిఎస్‌పిఎస్సీ) చైర్మన్‌, స‌భ్యుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ ఆమోదించారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బి. జనార్దన్‌ రెడ్డి (ఐఏఎస్‌) నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన పని చేస్తున్నారు.

సభ్యులు..

  • కారం రవీందర్‌ రెడ్డి
  • మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ
  • రిటైర్డ్‌ ఈ ఎన్సీ రమావత్‌ ధన్‌ సింగ్‌
  • సీబీఐటీ ప్రొఫెసర్‌ బీ లింగారెడ్డి
  • ఎస్డీసీ కోట్ల అరుణ కుమారి
  • ఆచార్య సుమిత్రా ఆనంద్‌ తనోబా
  • ఆయుర్వేద వైద్యులు అరవెల్లి చంద్ర శేఖర్‌ రావు

సభ్యులుగా నియమితులయ్యారు.

4 వారాల్లోపు టిఎస్‌పిఎస్సీ చైర్మ‌న్‌, స‌భ్యుల‌ను నియ‌మించాల‌ని ఇటీవ‌ల హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అలాగే త్వ‌ర‌లో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో టిఎస్‌పిఎస్సీ చైర్మ‌న్‌, స‌భ్యుల‌ను స‌ర్కార్ నియమించింది.

Leave A Reply

Your email address will not be published.