చిప్కో ఉద్య‌మ‌నేత‌‌ సుంద‌ర్‌లాల్ బ‌హుగుణ ఇక‌లేరు‌

న్యూఢిల్లీ  (CLiC2NEWS) : చిప్కో ఉద్య‌మ‌కారుడు‌, ప్ర‌ఖ్యాత ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌ సుంద‌ర్‌లాల్ బ‌హుగుణ (94) క‌రోనా వ్యాధితో క‌న్నుమూశారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా ప‌లు దీర్ఘ‌కాలిక అనారోగ్యాల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డ‌టంతో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఆయ‌న కోవిడ్ చికిత్స పొంద‌తూ ఈరోజు మ‌ధ్యాహ్నం మ‌ర‌ణించారు. సుంద‌ర్‌లాల్ బ‌హుగుణ మృతిపై ప్ర‌ధాని మోదీ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. భార‌త దేశం ఒక మ‌హోన్న‌త‌మైన వ్య‌క్తిని కోల్పోయిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.