AP Corona: 20,937 కొత్త కేసులు.. 104 మృతులు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 20,937 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1542079 కి చేరింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి 104 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 9904 కు పెరిగింది. ఇదే సమయంలో 20,811 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 13,23,019 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 209156 గా ఉంది.
జిల్లాల వారీగా మృతులు
చిత్తూరులో అత్యధికంగా 15, ప్రకాశం, విజయనగరం జిల్లాలో 10, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో 9, కృష్టా 8, అనంతపురం, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.