ఎపిలో 3 రోజులు వర్షాలు పడే అవకాశం!

అమరావతి (CLiC2NEWS): తూర్పు మధ్య బంగాళాఖాతతంలో కొనసాగుతున్న అప్పపీడనం ఈ రాత్రికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి రేపటికి తుఫానుగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
- ఉత్తర కోస్తాంధ్ర
ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. - దక్షిణ కోస్తాంధ్ర
ఈరోజు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. - రాయలసీమ
ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.