Ap Corona: కొత్త‌గా 18,767 కేసులు.. 104 మ‌ర‌ణాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 91,629 మందికి కరోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వహించగా రాష్ట్రంలో కొత్తగా 18,767 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఆదివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో ఇప్పటి వరకు ఎపిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1580827 చేరింది. గడిచిన 24 గంటల్లో 20,109 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో క‌రోనా బారినుండి కోలుకున్న వారి సంఖ్య 13,58,569 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల‌ సంఖ్య 2,09,237 ఉంది.

కాగా కొత్త‌గా రాష్ట్రంలో 104 మంది మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 10,126 కు చేరింది.

జిల్లాల వారీగా మ‌ర‌ణాలు
తాజాగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13, విజయనగరంలో 11, విశాఖలో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరిలో 8, గుంటూరులో 8, కృష్ణలో 8, కర్నూలులో 8, శ్రీకాకుళంలో 7, నెల్లూరులో 6, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించారు.

Leave A Reply

Your email address will not be published.