TS intermediate exams: జూన్ నెలాఖరులో పరీక్షలు?
తెలంగాణ సర్కార్ యోచన!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా కేసులు మొన్నటి వరకు విపరీతంగా పెరిగాయి.. గత వారం రోజులుగా 3 వేలు మించడం లేదు. ఈ నేపథ్యంలో.. జూన్ నెలాఖరులో ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించకుంటే మొదటి ఏడాది పరీక్షల ఫలితాల ఆధారంగా మార్కులు ఇచ్చే అంశాన్ని పరీశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చెప్పినట్లు సమాచారం.
ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించిన ప్రభుత్వం జూన్ 1న సమీక్షించి నిర్ణయం తీసకుంటామని వెల్లడించిన సంగతి తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలపై స్పష్టతకోసం ఎదురుచూస్తున్నారు.