టెట్ సర్టిఫికెట్ గడువు పొడిగింపు..

న్యూఢిల్లీ (CLiC2NEWS): Teacher Eligibility Test (టెట్) సర్టిఫికెట్ గడువు ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ టెట్ సర్టిఫికెట్ గడువు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. కాలపరిమితి ముగిసిన వారికి మళ్లీ సర్టిఫికెట్ ఇవ్వాలని అన్ని రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.