షేక్.బహర్ అలీ: మలబద్ధకంతో బాధపడుతున్నారా?

ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య. దీనికి కారణం మారుతోన్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి కావాల్సినంత నీటిని తాగకపోవడం, ఒకవేళ ఆహారం తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకాన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే పెనుముప్పు తప్పదని వైద్యులు సూచిస్తున్నారు.
ఆహారం
ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల మలం గట్టిగా మారి విసర్జనకు సమయం తీసుకుంటుంది. ఇది బయటకు రావాలంటే తీవ్ర ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది. అందరూ రెడీ టూ ఈట్ ఆహార పదార్థాల తినడంపై ఆసక్తి చూపుతున్నారు. జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా మల బద్దకానికి కారణం. పీచు పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవడం కూడా కారణం. ఒకవేళ ఆహారం తీసుకున్నా హడావుడిగా ముగించడం కూడా ఒక కారణం.
నీరు
మనిషి రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల మంచి నీటిని తాగాలి. దీని కంటే తక్కువ నీటిని తీసుకోవడంతో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో శరీరం తనకు కావాల్సిన నీటిని మూత్రం, మలం నుంచి తీసుకుంటుంది. ఫలితంగా మూత్ర సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తుంటాయి.
జీవనశైలి
ప్రస్తుత బీజీబీజీ జీవితంలో జీవన శైలి సరిగా లేకపోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. రోజులో అధిక సమయంకంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం.. అలాగే శరీరానికి తగినంత శ్రమ ఇవ్వకపోవడం వంటి వాటి వల్ల మలబద్ధకం వస్తుంది.
మలబద్ధకం నివారణ మార్గాలు
- ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మల బద్ధకానికి చెక్ పెట్టవచ్చు.
- ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, ఆల్కహాలు తీసుకోవడం మానుకోవాలి.
- నీరు రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి.
- ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని అధికంగా తినాలి.
- ఆహారంలో పీచు పదార్థాల స్థాయి (ఫైబర్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- పళ్ల రసాలను ఎక్కువగా తాగాలి.
- అధిక సమయం కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు ప్రతి అరగంటకోసారి లేచి కాస్త అటు ఇటూ నడవాలి.
- ప్రతీరోజు వ్యాయామం చేయాలి.
- మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండంటం అలవాటు చేసుకోవాలి.
- మలవిసర్జన చేసేటప్పుడు బలవంతంగా ముక్కకూడదు. అలాచేస్తే అర్శమొలలు తయారవుతాయి.
- రాత్రి నిద్ర పోయేటపుడు ఒక గ్లాస్ పాలలో 20 కిస్మిస్ వేసి బాగా మరిగించి తాగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ఎంత మలబద్దకం అయిన సరే పోతుంది.
- మలబద్ధకం సమస్య అధికంగా వేధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు, సెల్: 7396126557
Ho ho ho 🙂 🙂 🙂 Goooooood!