Mandapeta: `కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం`

మండపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోన సత్యనారాయణ

మండపేట (CLiC2NEWS): జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు, 18 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సినేషన్ ను రాష్ట్రాలు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని మండపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోన సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం జాతి నుద్దేశించి ప్రసంగించిన మోడీ కరోనా రెండవ దశ నడుస్తున్న నేపథ్యం లో వ్యాక్సిన్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారని తెలిపారు. వ్యాక్సిన్ లు కేంద్రమే కోనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది అన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసారన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ను ఉచితంగానే అందిస్తామని ప్రకటించారు. వ్యాక్సినేషన్ కోసం ఏ రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రధాని నొక్కి వక్కాణించారని వివరించారు.

వచ్చే కొన్ని నెలల్లో భారీ మొత్తంలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి కేంద్రమే డోసులు కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని వివరించారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందిస్తుందని వెల్లడించారు. ఎవరైనా ఉచిత టీకా వద్దనుకుంటే సొంతఖర్చుతో ప్రైవేటుగా టీకా వేయించుకోవచ్చని పేర్కొన్నారు. రూ.150 సర్వీస్ చార్జితో ప్రైవేటుగా వ్యాక్సిన్ పొందవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

ఇక, లాక్ డౌన్ వంటి కఠిన ఆంక్షల నేపథ్యంలో, పేదలకు ఇబ్బంది కలగకుండా దీపావళి వరకు 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.