సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి నియోజికవర్గంలోని 70 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 24 లక్షల 15 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 735 మందికి 4 కోట్ల 57 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి బిల్లులను తమ కార్యాలయానికి తీసుకువచ్చి ఇస్తే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి డబ్బులు ఇవ్వడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. నియోజికవర్గంలోని పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో కామారెడ్డి ఎం పి పి ఆంజనేయులు. నిమ్మ మోహన్ రెడ్డి తిరుమల గౌడ్. నెట్టు వేణుగోపాల్ రావు. మరియు కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు