సిఎం కెసిఆర్ లేకుంటే ఈటల స్థానమేంటి?: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ (CLiC2NEWS): ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కెసిఆర్.. తెలంగాణ కోసం పుట్టిన పోరాటాల పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి లేకుంటే తన స్థానం ఎక్కడుండేదో ఈటల రాజేందర్‌కు తెలియదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాజకీయ భవిష్యత్‌ను ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఈటల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో హరీశ్‌రావును కాదని ఈటలకు.. కెసిఆర్ ఫ్లోర్‌లీటర్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఈటల చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు.