కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం

పనాజీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల పెరుగుదల ఇంకా కొనసాగుతోంది. కొవిడ్ కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ తదితర ఆంక్షలను కొనసాగిస్తున్నాయి. తాజాగా గోవాలో కర్ఫ్యూను ఈ నెల 21 వరకు ఆ రాష్ట్ర సర్కార్ పొడగించింది. ఈ మేరకు ఆ గోవా సిఎం ప్రమోద్ సావంత్ కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. కర్ఫ్యూ ఆంక్షల ఈ నెల 21న ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించారు. పంచాయతీ, రాష్ట్రవ్యాప్తంగా షాపులు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తెరువచ్చన్నారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు 50 మంది వరకే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు.