కరోనాతో జూలో మరో సింహం మృతి

చెన్నై(CLiC2NEWS): తమిళనాడులోని వండలూర్ జూలో కొద్ది రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఓ సింహం మృతి చెందగా.. అదే జూలో తాజాగా మరో సింహం కరోనాతో మృతిచెండం కలకలం రేపింది. జూలోని ఏసియాటిక్ పద్మనాథన్ అనే 12 యేళ్ల మగ సింహం గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్నది. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ప్రాణాలు విడిచినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దాంతో అరైనర్ అన్నా జూలాజికల్ పార్కులో కరోనా కారణంగా మృతిచెందిన సింహాల సంఖ్య రెండుకు చేరింది.