TS: రాష్ట్రంలో ఇవాళ‌, రేపు వ‌ర్ష సూచ‌న‌

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు (గురు, శుక్రవారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బలంగా వీస్తు‌న్న పశ్చి‌మ‌గా‌లుల ప్రభావంతో ఉరు‌ములు, మెరు‌పులతో వర్షం కురిసే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. ఈ గాలుల ప్ర‌భావంతో ఆది‌లా‌బాద్‌, కుమ్రం‌భీం ఆ‌సి‌ఫా‌బాద్‌, మంచి‌ర్యాల, నిర్మల్‌, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగ‌‌ర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా‌ల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

Leave A Reply

Your email address will not be published.