ప్రారంభ‌మైన ఇంట‌ర్‌సిటీ రైలు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): సెకండ్ వేవ్ క‌రోనా ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో లింగంప‌ల్లి-విజ‌య‌వాడ ఇంట‌ర్‌సిటీ రైలును ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే పున‌రుద్ధ‌రించింది. కొవిడ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో జూన్ 2న ఇంట‌ర్‌సిటీ రైలును అధికారులు ర‌ద్దుచేశారు. మ‌ళ్లీ నేటి (గురువారం) నుంచి రైలు స‌ర్వీసును ప్రారంభించారు. ఉద‌యం 4.40 గంట‌ల‌కు బ‌య‌లుదేరిన ఈ ఇంట‌ర్‌సిటీ రైలు (02796) 10.30 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌కు చేరుకుంటుంది. మ‌ళ్లీ సాయంత్రం 5.30కి విజ‌య‌వాడ‌లో బ‌య‌లుదేరి రాత్రి 11.20 గంట‌ల‌కు లింగంప‌ల్లికి చేరుకుంటుంది.

Leave A Reply

Your email address will not be published.