మేడిగడ్డ నుంచి 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీకి వరద నీరు బారీగా వచ్చి చేరుతుంది. దాంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి దాదాపు 55 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు బ్యారేజీ గేట్లను ఎత్తి 23,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.