ర‌ఫెల్‌తో వాయు సేన మరింత పటిష్టం : ధోనీ

న్యూఢిల్లీ : రాఫేల్‌ యుద్ధ విమానాల రాకతో భారత వాయు సేన సామర్థ్యం మరింత పెరిగిందని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ హర్షం వ్యక్తం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఉన్న భారత వాయు సేన స్థావరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలను లాంఛనంగా వాయు సేనలోకి ప్రవేశపెట్టారు. భారత దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఐఎఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కెఎస్‌ బధౌరియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎంఎస్‌ ధోనీ ట్వీట్‌లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ”తుది ప్రవేశ కార్యక్రమంతో ప్రపంచపు అత్యుత్తమ యుద్ధ విమానంగా నిరూపితమైన 4.5 జనరేషన్‌ ఫైటర్‌ ప్లేన్‌ ప్రపంచపు అత్యుత్తమ ఫైటర్‌ పైలట్ల చేతుల్లోకి వస్తుంది. మన పైలట్ల చేతుల్లో, ఐఎఎఫ్‌లోని వేర్వేరు విమానాల కలయికతో ప్రబల శక్తిగల పక్షుల ప్రాణాంతక, విధ్వంసకర సామర్థ్యం పెరుగుతుంది” అని ధోనీ ఓ ట్వీట్‌లో సంతోషం వ్యక్తం చేశారు. ”ప్రతిష్టాత్మక 17 స్క్వాడ్రన్‌ (గోల్టెన్‌ యారోస్‌)కు శుభాకాంక్షలు.. మిరాజ్‌ 2000 సర్వీస్‌ రికార్డును రఫేల్‌ అధిగమించాలని మనమంతా ఆశిద్దాం. అయితే ఎస్‌యు30 ఎంకెఐ నాకు ప్రీతిపాత్రమైనది. బార్సుకి భీకర పోరుకు కొత్త లక్ష్యం సమకూరింది. సూపర్‌ సుఖోరుగా అప్‌గ్రేడ్‌ అయ్యే వరకు బివిఆర్‌ ఎంగేజ్‌మెంట్‌ కోసం ఎదురుచూడాలి” అని మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు. బివిఆర్‌ ఎంగేజ్‌మెంట్‌ అంటే బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ మిసైల్‌ అని అర్థం. ఇది గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి. ఇది దాదాపు 37 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. కాగా ర‌ఫెల్ రాక‌తో భార‌త్ వాయుసేన ప‌టిష్ట‌మ‌యింద‌ని దేశంలోనే ప్ర‌ముఖులే కాకుండా సామ‌న్యులు కూడా చ‌ర్చించుకుంటున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.