తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం

తిరుపతి (CLiC2NEWS): తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం జరుగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయంలో ఏకాంతంగా స్వామివారికి పుష్పయాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.