India Corona: 58 వేలకు దిగివచ్చిన కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కరోనా సెకండ్ వేవ్ రోజువారీ కేసులతో పాటు మరణాలు దిగి వస్తుండడం ఊరట కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 58,419 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,81,965కు పెరిగాయి.
- కొత్తగా దేశంలో 87,619 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 2,87,66,009 మంది బాధితులు కోలుకున్నారు.
- 24 గంటల్లో 1,576 మరణాలు నమోదయ్యాయి.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,86,713 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ప్రస్తుతం దేశంలో 7,29,243 యాక్టవ్ కేసులున్నాయి.
- ఇప్పటి వరకు దేశంలో 27,66,93,572 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.