యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించిన కెసిఆర్

యాదాద్రి (CLiC2NEWS): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సిఎం కెసిఆర్ సందర్శించారు. వరంగల్ పర్యటన ముగించుకొని హెలికాప్టర్ లో యాదాద్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఆలయ పనులను పరిశీలించారు. యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. ప్రధానాలయంలో పసిడి కాంతులు వెదజల్లేలా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ఆలయ సందర్శనలో భాగంగా అధునాతన విద్యుద్దీపాలంకరణ ట్రయల్ రన్‌ను సీఎం పరిశీలించారు.