మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషణ్ మృతి
మీడియాకు వెల్లడించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్

కొత్తగూడెం (CLiC2NEWS): మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) గుండెపోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. ఎస్పీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత కొంత కాలంగా కరోనాతో బాధపడుతున్న హరిభూషణ్ గుండెపోటుతో మృతి చెందాడని వెల్లడించారు. హరిభూషణ్ భార్య శారదతో సహా మరికొంతమంది అగ్రనాయకులు కరోన సోకి బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) వుప్పు తిరుపతి, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.