Polavaram: ముంపు గ్రామాలలో నిలిచిపోయిన రాకపోకలు

దేవీపట్నం (CLiC2NEWS): వర్షాకాలం కావడంతో పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యామ్ వద్ద వరద ప్రవాహం నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా వస్తున్న వరద నీటితో వెనుక భాగంలోని పోచమ్మ గండి పూడిపల్లి దేవీపట్నం నిర్వాసితులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. నీటి ప్రవాహం పెరగడంతో దేవీపట్నం మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దండంగి, చిన్న రమణయ్యపేట గ్రామాల మధ్య వాగుపై వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దండంగి, గుబ్బల పాలెం, తోయ్యేరు, ఏ వీరవరం ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లోని రోడ్డు పూర్తిగా మునిగిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది.