ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. జడేజా నంబర్ వన్ ఆల్‌రౌండర్

దుబాయ్ (CLiC2NEWS): తాజాగా ఐసిసి విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో నంబర్‌వన్‌గా నిలిచాడు. 386 పాయింట్లతో జడేజా టాప్ ప్లేస్ లోకి నిలిచాడు. తర్వాతి స్థానాల్లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఉన్నారు. ఇక బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండోస్థానంలో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో కెప్టెన్ కోహ్లి 4వ స్థానంలో ఉండగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్, రోహిత్ శర్మ సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నారు.