TS: 97 లక్షల మందికి వ్యాక్సిన్: ప్రజారోగ్య సంచాలకులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు వెల్లడించారు. దీనిలో 83 లక్షల మందికి మొదటి డోసు టీకా ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2.2 కోట్ల మందికి టీకా ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 కేంద్రాల ద్వారా టీకాలు ఇస్తున్నామని తెలిపారు. 24 మొబైల్ వ్యాన్ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎంసీలో రోజుకు 1500 మందికి పైగా టీకాలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వెలుగు చూడలేదని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.