28న పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాద్ (CLiC2NEWS): ఈ నెల 28న మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పీవీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించనున్నారు. నెక్లెస్ రోడ్ ఆరంభంలో 26 అడుగుల పీవీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై ప్రభుత్వ సిఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.