JK: జ‌మ్మూక‌శ్మీర్‌ నేత‌ల‌తో మోడీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీతో జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన అఖిల‌ప‌క్ష నేత‌లు గుర‌వారం స‌మావేశం అయ్యారు. ఢిల్లీలోని ప్ర‌ధాన మంత్రి నివాసంలో ఈ భేటీ జ‌రిగింది. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేసిన త‌ర్వాత ఈ భేటీ జ‌ర‌గడం విశేషం. జ‌మ్మూక‌శ్మీర్‌లో రాజ‌కీయ సుస్థిర‌త‌ను తీసుకురావాల‌న్న ఉద్దేశంతో స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ స‌మావేశంలో పాల్గొనేందుకు గులాంన‌బీ ఆజాద్‌, ఒమ‌ర్ అబ్ద‌ల్లా, మెహ‌బూబా ముఫ్తీ, యూసుఫ్ త‌రిగామి త‌దిత‌ర జ‌మ్మూ కాశ్మీర్ చేందిన 14 మంది నేత‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అలాగే కేంద్రం త‌ర‌ఫున ప్ర‌ధాని మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ కూడా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.