TS: 2 రోజులు మోస్తరు వర్షాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు (శుక్ర, శనివారాలు) మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జార్ఖండ్ నుంచి ఒడిశా దక్షిణ కోస్తా మీదుగా ఎపి వరకు ఉపరితల ద్రోణి వ్యాప్తించి ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అలాగే ఒకటి రెండుచోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.