AP: జూలై నెల వ్యాక్సినేషన్‌ ప్లాన్ సిద్ధం చేసుకున్న స‌ర్కార్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): క‌రోనా సెకండ్ వేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌గ్గుముఖం ప‌ట్టిన విష‌యం తెలిసిందే. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేష‌న్‌లో వేగం పెంచాయి. వ్యాక్సినేష‌న్ లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ వచ్చే నెలకు వ్యాక్సినేషన్‌ ప్లాన్ ను ప‌క్కాగా రెడీ చేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేవ్ రాష్ట్రానికి 70.86 లక్షల కరోనా టీకాలు వస్తాయని సర్కార్‌ అంచనా వేస్తుంది. వీటిల్లో ప్రభుత్వానికి 53.14 లక్షలు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు 17.72 లక్షల టీకాలు కేటాయించింది. అయితే జులై నెలలో సుమారుగా 31.25 లక్షల మందికి రెండో డోస్‌ వేయాల్సి ఉంటుందని అంచనా. అందుకే మెజార్టీ టీకా డోసులు సెకండ్‌ డోస్‌ వేసే వారికే కేటాయించాల్సి రావడంతో వైద్యారోగ్య‌శాఖ ప్రణాళికా బద్దంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టనుంది.

Leave A Reply

Your email address will not be published.