TS: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

హైదరాబాద్ (CLiC2NEWS): జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలలో కురిసి భారీ వర్షాలకు అక్కడ నుంచి వరద ప్రవాహం జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 25,344 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 25,214 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టు 1040 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.768 టీఎంసీల నీటినిల్వ ఉన్నది.