ఎస్.వి రమణా చారి: బతికుంటే బలుసాకు తింటా..

అయ్యా నాకు బడి వద్దు

రెండేళ్లనుంచి ఇంట్లోఉంటి

కరోనా రోగమంటూ నన్ను బందీ చేస్తిరి

వచ్చిన అక్షరాలు బుక్కపెడితి

అసలు బడి యాడవుందో తెలిస్తేకదా

నా దోస్తుగాళ్ళు కూడా యాదికొస్తలేరు

తెలియని రోగానికి తెలిసినోళ్లు చచ్చిరి

పనులేక మా అవ్వా, నాయిన పస్తులుండిరి

మా తాతకు రోగమొచ్చి చచ్చిపోయే

నాన్నమ్మ ఇంకా మంచంలోనే మూల్గుతుంది

మాఇంటిపక్కనోలు ఆగం ఆగం ఐ తుండ్రు

మాకు మళ్లీ బడి అంటుండ్రు

చావో,రేవో తేలక పాయే

బతికుంటే బలుసాకుతింటా

అయ్యా నేను పోను బడికి

నేను ఎల్లి పోతున్నా ఉరికి ఉరికి

ఎస్‌.వి.రమణా చారి,

సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.