తెలంగాణ మంత్రులు ఎక్కువ మాట్లాడుతున్నారు..: ఎపి సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎం అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో ఎపి-తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై ప్రధానంగా చర్చించారు.
తెలంగాణలో విద్యుదుత్పత్తి, అనుమతి లేకుండా నీటి వాడకంపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) (KRMB) లేఖ రాయాలని అధికారులను.. సీఎం జగన్ ఆదేశించారు.
అయితే జలవివాదాలు, తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై ఏపీ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నానని.. వారిని ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదని వ్యాఖ్యానించారు.
ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని జగన్ ప్రశ్నించారు. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులు, అధికారులకు జగన్ సూచించారు.
అలాగే జల వివాదంపై ప్రధాని మోడీ కూడా లేఖ రాయాలని మంత్రులను సిఎం ఆదేశించారు.