మంచిర్యాలలో పట్టణ ప్రగతి, హరితహారం..

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో గురువారం పట్టణప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలి కేరితో కలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, టిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు సత్యం, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.