వికారాబాద్ లో పల్లె ప్రగతిని ప్రారంభించిన మంత్రి సబిత

వికారాబాద్ (CLiC2NEWS): జిల్లాలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. జిల్లాల‌లోని పులుమద్ది గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను ఈ సంద‌ర్భంగా మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పల్లెల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవ్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య ,కలెక్టర్ పౌసుమి బసు, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ,డీపీఓ రెహనా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.