వేముల‌వాడ ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో పాల్గొన్న మంత్రి కెటిఆర్‌

వేముల‌వాడ‌(CLiC2NEWS): ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధుల‌ను అరిక‌ట్టొచ్చు అని పుర‌పాల‌క మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వేముల‌వాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వేముల‌వాడ ప‌ట్ట‌ణం ద‌క్షిణ కాశీగా పేరు గాంచింది. రాజ‌న్న ఆల‌యానికి రోజు వేలాది మంది భ‌క్తులు వ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణాన్ని ప‌రిశుభ్రంగా ఉంచుకొని.. ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల‌న్నారు.

మిషన్ భగీరథ లైన్ 60 శాతం పూర్తి అయింద‌ని కెటిఆర్ పేర్కొన్నారు. దసరా లోపు వేములవాడ పట్టణంలో ఉన్న 14 వేల కుటుంబాలకు నల్లా నీరు అందిస్తాం అని మంత్రి చెప్పారు. ఒక్క రూపాయి చెల్లించి న‌ల్లా క‌నెక్ష‌న్ తీసుకోవ‌చ్చు అని సూచించారు. 10వ వార్డులో కమ్యూనిటీ మహిళా భవనానికి తక్షణమే రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.