Mandapeta: ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు..

చావు బతుకుల మధ్య కొట్టి మిట్టాడు తున్న యువకుడు..

మండపేట (CLiC2NEWS): నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. కుటుంబాన్ని పోషించేది ఒక్కడే. తల్లి దండ్రులకు పెద్ద వయసు కావడంతో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. కుటుంబ పోషణ కోసం తన చదువును మధ్యలోనే ఆపేసి పెయింటింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పని చేస్తూ తల్లి దండ్రులతో సంతోషంగా గడుపుతున్న ఆ యువకుడు బల్లా చింటూ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ధవళేశ్వరం గ్రామానికి చెందిన చింటూ రాజమండ్రి పనికి వెళ్ళాడు. పని ముగించుకొని ధవళేశ్వరం ఇంటికి తిరిగి వస్తుండగా కుక్క అడ్డు పడి బండితో సహా కింద పడిపోయాడు. దీంతో చింటూకి తీవ్ర గాయాలతో పాటు తలకు బలమైన గాయం అయింది. స్థానికులు అంబులెన్స్ లో యువకున్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించిన డాక్టర్ లు తలకు తగిలిన గాయానికి యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే కాకినాడ తీసుకెళ్లండి అని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం అతని బంధువులు కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం చేయించడానికి తగిన స్తోమత లేక కుటుంబ సభ్యులు దీనంగా ఎదురు చూస్తున్నారు. తమ కొడుకు ఆసుపత్రి   బెడ్ మీద చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడని తమ కొడుకు ప్రాణాపాయ పరిస్థితిపై కనికరం చూపి దయ గల మహారాజులు ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై దాతలు స్పందించి ఎవరికి తోచిన సహాయం వారు బాధితుల సెల్ నంబర్: 9949009904.. ఫోన్ పే కు గాని, గూగుల్ పేకు గాని డబ్బులు వేసి ఆదుకుంటారనే ఉద్ధేశంతో చిరు ప్రయత్నంగా వార్త రూపంలో మీకు తెలియ పరుస్తున్నాము. దాతలు స్పందించి ఓ నిండు ప్రాణానికి అండగా నిలిచి నిరు పేద కుటుంబాన్ని రక్షిస్తారని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.