Corona: సెకండ్ వేవ్ ఇంకా కొన‌సాగుతోంది: కేంద్ర ఆరోగ్య‌శాఖ

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ ఇంకా ప‌లు ప్రాంతాల్లో స్వ‌ల్ప స్థాయిలో కొన‌సాగుతోంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ .. సేద తీరేందుకు కొండ ప్రాంతాల‌కు వెళ్తున్న వారంతా కోవిడ్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఒక‌వేళ స‌రైన ప్ర‌వర్త‌నా నియ‌మావ‌ళిని పాటించ‌కుంటే.. అప్పుడు మ‌ళ్లీ ఆంక్ష‌ల‌ను విధిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఎండ‌లు మండుతున్న నేప‌థ్యంలో.. చాల మంది ప‌ర్యాట‌కులు హిల్ స్టేష‌న్ల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. అంద‌రూ ఎంతో క‌ఠినంగా నియమావ‌ళి పాటించ‌డం వ‌ల్లనే కోవిడ్ అదుపులోకి వ‌చ్చింద‌ని అన్నారు. ఇప్ప‌డుఆ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే ఆ ఫ‌లితాల‌కు లాభం ఉండ‌ద‌ని ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.