Hyderabad: బోనాల సందడి షురూ

హైదరాబాద్ (CLiC2NEWS): ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగ ఘనంగా జరుగుతున్నదని చెప్పారు.

కరోనా నిబంధనలను పాటిస్తూ బోనాలు జరుపుకోవాలని మంత్రి తలసాని సూచించారు. గోల్కొండ బోనాలు సందర్భంగా పోలీసులు పటిష్ట భ్రదత ఏర్పాట్లు చేశారు. సుమారు 600 మంది సిబ్బందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రారభమైన ఆషాఢ బోనాలు వచ్చే నెల 8వ తేదీవరకు కొనసాగనున్నాయి. భక్తులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలి అధికారులు కోరారు.
