Mancherial: ఆత్మీయ ఉపాధ్యాయుడు వెంకటయ్య ఇకలేరు
![](https://clic2news.com/wp-content/uploads/2021/07/venkataiah.jpg)
మంచిర్యాల (CLiC2NEWS): ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్మిళ్ళ మంచిర్యాల యందు సుధీర్ఘ కాలం సేవలందిన ఉపాధ్యాయుడు వెంకటయ్య ఈ రోజు (గురువారం) పరమపదించారు.
వెంకటయ్య అంకిత భావంతో పనిచేసేవారు, విద్యార్థినీ విద్యార్థులతో చాలా ఆత్మీయంగా మెదిలేవాడు, ఇరవై నాలుగు గంటలు పాఠశాల కొరకు పనిచేసేవారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు కావలసిన సహాయసహాకారాలు అందించి అందరి వద్ద మంచిపేరు సాధించారు. ఎప్పుడూ చిరునవ్వుతో, అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఈ రోజు తుది శ్వాస విడిచారు.
వారి మరణం వార్త తెలిసిన అతని పూర్వ విద్యార్థినీ విద్యార్థులు, అతనితో పనిచేసిన ఉపాద్యాయినీ ఉపాధ్యాయులు, అతని బంధు మిత్రులు, అభిమానులు శ్రేయోభిలాషులు శోకతప్త హృదయాలతో అతని ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Wow, amazing weblog structure! How long have you ever been running a blog for? you make running a blog look easy. The overall glance of your web site is wonderful, let alone the content!!