కుమ్రం భీం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత‌

ఆసిఫాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. భారీ వ‌ర్షాకు ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్ల‌ను ఎత్తి దిగువ‌కు 58,633 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 58,673 క్యూసెక్కులుగా ఉంది. దిగువ ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు ఇప్ప‌టి కే హెచ్చ‌రిక‌లు జారీ చేశ‌రు.

Leave A Reply

Your email address will not be published.