గోదావరి నది పంప్ హౌస్ లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను రక్షించిన పోలీసులు

మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ సమీపంలోని గోదావరి నదిలోని జైపూర్ పవర్ ప్లాంట్ పంప్ హౌస్ లో విధులు నిర్వహించేందుకు వెళ్లి గోదావరి నీరు చుట్టుముట్టడం తో పంప్ హౌస్ లోనె ఉండిపోయిన ముగ్గురు వ్యక్తులను కోటపల్లి పోలీస్, ఫైర్ అధికారులు రక్షించారు. దేవులవాడ పవర్ ప్లాంట్ పంప్ హౌస్ లో విధులు నిర్వహించేందుకు ఈరోజు ఉదయం అట్టేల వెంకటేష్ (ఆపరేటర్), కొండ ప్రవీణ్ (ఎలక్ట్రిషన్), M శేఖర్ (సెక్యూరిటీ) వెళ్లి అక్కడే చిక్కుకున్నారు. వరద ప్రవాహం పంప్ హౌస్ చుట్టూ చేరగా ఈ ముగ్గురు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడగా ఈ విషయాన్నీ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంబంధిత అధికారులు పోలీస్ అధికారులకు సమాచారం అందించగా *చెన్నూరు రూరల్ CI నాగరాజు, కోటపల్లి SI రవి కుమార్* లు ఫైర్ అధికారులతో రంగంలోకి దిగారు. ఎర్రాయపేట గ్రామానికి చెందిన గజ ఈతగాళ్ళు, తాళ్ళ సహాయంతో పాటు లైవ్ జాకెట్ లను ఉపయోగించి పోలీస్, ఫైర్ అధికారులు స్థానికుల సహాయంతో ఆ ముగ్గురు వ్యక్తులను ఒడ్డుకు తీసుకువచ్చారు.
వరద లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తుల ను కాపాడిన పోలీస్, ఫైర్ అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.