భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

హైదరాబాద్ (CLiC2NEWS): మహారాష్ట్రలో, ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా గోదావరికి వరద పోటెత్తుతున్నది. గంట గంటకూ నదిలో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. భారీగా వరద నీరు చేరుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ముంపు బాధితులను కోరారు.