Ujjaini Mahakali: బోనమెత్తిన లష్కర్

హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం ఉదయం 4 గంటలకే ఆరంభమయ్యాయి. ఈ వేడుకలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల వేడుకను పురస్కరించుకుని వేకువజాము నుంచే భక్తులు బోనం సమర్పించడానికి ఆలయానికి బారులుతీరారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళా భక్తుల కోసం నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పోలీసులతో 2,500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు చేపట్టారు. ఇవాళ (ఆదివారం) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.